స్థలం లేదా ఇల్లు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

wow19tv
By wow19tv

స్థలం లేదా ఇల్లు కొన్నప్పుడు లేదా అమ్మినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

ముందుగా Brokers చేసే మోసాలు:

) Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు.

2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చగొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు.

3) నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.

4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవాలి అంటే registration office లో EC (ఏoకంబరెన్స్ సర్టిఫికెట్)తెస్తే తెలుస్తుంది. EC కీ రూ.300 రూపాయలు వరకూ ఖర్చు అవుతుంది

5) కొనే ముందు original sale deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.

6) ఎట్టి పరిస్థితుల్లో Sale agreement ( contract) మినిమం 3నెలలు ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్నా 3నెలలకు తక్కువకు అగ్రిమెంట్ చెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. అగ్రిమెంట్ అమౌంట్ 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. ఒకవేళ అగ్రిమెంట్ రద్దు అయితే అగ్రిమెంట్ అమౌంట్ తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.

7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వాళ్ళు కమిషన్ కోసం కక్కుర్తి పడతారు.

8.) A, B బ్రోకర్లు ఉన్నారు అనుకుందాం. A బ్రోకర్ మీకు తెలుసు, అతను B బ్రోకర్ దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B బ్రోకర్ కి అగ్రిమెంట్ చేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ రూ. లక్ష రూపాయలు అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ బ్రోకర్లు 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని బేరం కుదుర్చుకొంటారు. అప్పుడు B బ్రోకర్ 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం చేసుకుంటాడు.

9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడేటప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ బ్రోకర్లు యజమాని బిజీ గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం వీడియో కాల్ l లో ఐనా మాట్లాడండి. యజమాని ఏదయినా ఐ.డి.ప్రూఫ్ చూపించమనాలి.

10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ ఆడ్రస్సులు నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో మంచి ఏరియా లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు.మీరు అనుకున్న స్థలం ఒరిజినల్ స్థలాలు వేరువేరుగా ఉంటాయి.

11) ఒరిజినల్ గా స్థలం సైజు , దస్తావేజులలో స్థలం సైజు లలో తేడాలు ఉండవచ్చు. జాగ్రత్తగా పరిీలించాలి.

స్తలం లేదా ఇల్లు కొనేటప్పుడు కావలసిన పత్రాలు (డాక్యుమెంట్లు) :

1) అసలు యజమాని క్రియా దస్తావేజు ఒరిజినల్ ( Sale Deed document origin) జాగ్రత్త గా పరిశీలించాలి
2) లింక్ డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి.
3) అన్ని డాకుమెంట్స్ ల లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవారి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితే లేదా వారసత్వముగా వచ్చే ఆస్తి అయిన పక్షంలో)
4) దస్తావేజులు ముందు పేజీలో లో ఏదయినా కోర్ట్ సీలు లేదా సంతకం ఉంటే సదరు ఆస్థి మీద కోర్టు కేసు ఉన్నది అని అర్థంచేసుకోవాలి
5) EC – అన్ కoబరెన్స్ సర్టిికెట్ (Encumbrance certificate (EC)
6) మదర్ డీడ్ సర్టిఫికేట్ (Mother deed certificate)
7) వ్యవసాయ భూమి అయిన పక్షంలో RTC సర్టిఫికెట్ – Record of Rights, Tenancy and Crops .
8.) సర్వే స్కెచ్ (Survey Sketch)
9) లే అవుట్ అప్రూవల్ ( Layout Approval)
10) వ్యవసాయ భూమి అయితే ఖాతా సర్టిికెట్ ( Katha Certificate)
11) లాండ్ కన్వర్షన్ సర్టిికెట్ Conversion ( agriculture to Non-Agriculture land conversion)
12) ఆస్తీ పన్ను సర్టిఫికెట్ (Property Tax Certificate)
13) SC, ST సోదరులకు ప్రభుత్వం ఉచితముగా ఇచ్చిన స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లనేరవు. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు
14) పేద వారికి ప్రభత్వం ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు , అసైన్డ్ భూములు కొనకూడదు.

15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని బ్రోకర్లు కు చెప్తూ కమిషన్ తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.

16) ఆస్తీ తాలూకు దస్తావేజులు ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకూడదు. ఆ నకళ్లు ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి హాని అవకాశం ఎక్కువ.

17) ఇల్లు కట్టి ఉంటే బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉండాలి.

18) అగ్రిమెంట్ రోజు, రిజిస్ట్రేషన్ ముందు రోజు EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర అగ్రిమెంట్ వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.

19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ లైన్లు ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉన్నయా, టౌన్ ప్లానిoగ్ రికార్డులు నందు సదరు స్థలం చెరువులు, పార్కు లు, లేదా ఏదైనా ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం మార్క్ చేసి ఉంటే సదరు స్థలాలు కోనకూడదు.

20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15 సంవత్సరాలు క్రితం ఆన్లైన్ పద్ధతి లేదు. ఆప్పట్లో లో ఒకే ఆస్తిని న ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేసి మోసం చేసేవారు.

బ్యాంక్ లోన్ తీసుకొనే అప్పుడు వాళ్ళు చేసే మోసాలు…….

1) ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రోకర్ లేదా యజమాని సూచించిన బ్యాంక్ లో అప్పు తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళకు కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది.

2) బ్యాంక్ లోన్ రావాలి అంటే పైన చెప్పిన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ లోన్ రాదు.

3) బ్యాంక్ లోను దస్తావేజులలో చూపిన ఆస్తీ ప్రభుత్వ రిజిస్ట్రేన్ విలువకు 70% నుంచి 80% వరకు ఇస్తారు .ప్రభుత్వ రిజిస్ట్రేన్ విలువ రూ 5 లక్షల రూపాయలు అనుకోంటే. అసలు మార్కెట్ విలువ 30 లక్షల రూపాయలు అనుకోంటే మీకు బ్యాంక్ లోన్ 15 లక్షల రూపాయలు కావాలి అనుకోంటే. అప్పుడు మీరురిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో 20 లక్షల రూపాయలు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు 2o లక్షలలో లో 75% అంటే 15 లక్షలు బ్యాంక్ లోన్ వస్తోంది.

4) మీరు 20 లక్షలు registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి. అందువల్ల యజమాని ఒప్పుకొడు.

5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటుంది మినిమం 10,000. 1.5% loan amount లో Insurance తీసుకోవాలి . కొన్ని Banks (DHFL) 5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో Revenue stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.

6) Registration అప్పుడు Bank agent వచ్చి చెక్ యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి జిరాక్స్ తీసుకోండి.

7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1వారం లో Loan process complete అవుతుంది అని చెపుతారు. Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు.

8) బ్యాంక్ లోన్ process మినిమం 20days పడుతుంది. బ్యాంక్ వారు చెప్పే మాటలు నమ్మి sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. మినిమం 3నెలలు agreement కు సమయం తీసుకోవాలి.

9) personal loan తీసుకుంటే Processing fee ఉంటుంది Insurance optional. ముందే Insurance వద్దు అని చెప్పాలి.

ఆస్తిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించాలి?

అవసరమైన పత్రాల జాబితా:

రెండు పార్టీల పాస్‌పోర్ట్-పరిమాణ ఫోటో – కొనుగోలుదారు మరియు విక్రేత.
ఫోటో గుర్తింపు (ఓటరు గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు).
అసలు పాత అమ్మకపు దస్తావేజు యొక్క ధృవీకరించబడిన కాపీ.
తాజా ఆస్తి రిజిస్టర్ కార్డు యొక్క కాపీ (నగర సర్వే విభాగం నుండి).
మున్సిపల్ టాక్స్ బిల్లు కాపీ.

కొనుగోలుదారు మరియు విక్రేత, ఇద్దరు సాక్షులతో పాటు, ఆస్తి ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి లావాదేవీని నమోదు చేసుకోవాలి.

Share This Article
Leave a comment