రాజన్న సిరిసిల్ల జిల్లా… wow19tv.com
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మానాల లో మెగా హెల్త్ క్యాంప్:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు.
రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ వారి సౌజన్యంతో రుద్రంగి మండలం మానాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ నెల 10-07-2024 (బుధవారం) రోజున ఉదయం 10:00 గంటల నుండి నిపుణులైన వైద్యుల చేత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాడం జరుగుతుందని రుద్రంగి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…
కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి , సూదుర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతిమ హాస్పిటల్ వారి సహకారంతో ఈ నెల 10-07-2024 బుధవారం రోజున మానాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, రుద్రంగి మండల ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు..
మెగా హెల్త్ క్యాంప్ కి సంబంధించిన పోస్టర్ ని అధనవు ఎస్పీ చంద్రయ్య, చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. wow19tv.com