అర్హులైన రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ..

wow19tv
By wow19tv
పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రం

అర్హులైన రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ:: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు

ప్రతి నెలా ఉచిత కోడెల పంపిణీ

నిబంధనల మేరకు అర్హులను కమిటీ ద్వారా ఎంపిక

పంపిణీ చేసిన కోడె, ఆవు సంరక్షణ కోసం పకడ్బందీగా అంగీకార పత్రం

వేములవాడ ఆలయ గోవుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారితో పాటు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు,

 

వేములవాడ దేవస్థానం గోశాలలోని కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పాపూర్ వేములవాడ దేవస్థానం గోశాల నుంచి రైతులకు ఉచితంగా కోడెల, ఆవుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ
దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడ నుంచో వేములవాడకు వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని కోడె కడుతారని తెలిపారు. ప్రతి నిత్యం భక్తుల కోలాహలంతో స్వామి, అమ్మ వార్ల దర్శనం తో పాటు కోడె మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.

వేములవాడ దేవస్థానం గోశాలలో 400 గోవుల సామర్థ్యం ఉందని, కానీ ప్రస్తుతం అందులో 1500 పైగా కోడెలు, గోవులు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని అర్హులైన పేద రైతులకు, ఇతర గోశాలలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరువతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామని అన్నారు.

గోశాలలో కోడెల సంరక్షణకు వసతులు కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని , గోశాలలో అదనపు షెడ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. గోశాలలో డ్రైనేజీ వ్యవస్థ ఇతర సౌకర్యాల కల్పనకు దేవాదాయ శాఖ ద్వారా అదనపు నిధులు మంజూరు చేస్తామని అన్నారు.

గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలు, ఆవులు ఇతరత్రా పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందని అన్నారు. వ్యవసాయం చేసే పేద రైతులకు 2 కోడెలను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.

కోడెలను పొందిన రైతులు వీటిని జాగ్రత్తగా దైవ రూపంగా భావించి చూసుకోవాలని, వీటిని ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని, సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వీటి వినియోగం పై పకడ్బందీ అంగీకార పత్రం రూపొందించామని అన్నారు.

అర్హులైన రైతులకు ఉచితంగా కోడల పంపిణీ కార్యక్రమం ప్రతి మాసం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. వేములవాడ దేవస్థానం వద్ద 400 కోడెలు అందుబాటులో పెట్టుకొని మిగిలిన కోడెలను ప్రతి నెలా నిరంతరాయంగా ఉచిత పంపిణీ చేస్తామని అన్నారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ ఈవో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విప్ సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ దేవస్థానంలోని కోడెలను పేద రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఒప్పించారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన రైతులను ప్రత్యేక కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో విచారించి ఎంపిక చేసామని అన్నారు.

దేవస్థానం గోశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కోటి 11 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, వీటితో గోశాలలో కోడలకు అదనపు షెడ్ల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామని, వీటిని ద్వేతగా తిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

అనంతరం రైతులకు కోడెలను ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈ . ఓ. వినోద్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతి నిధులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. wow19tv.com

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు
అర్హులైన రైతులకు ఉచితంగా కోడెల పంపిణీ

Share This Article
Leave a comment