రాజన్న సిరిసిల్ల జిల్లా
చందుర్తి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్
ఈ రోజు చందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బైరగోని లావణ్య రమేష్ అధ్యక్షతన జరిగిన చందుర్తి మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ప్రభుత్వ విప్, ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి.
అనంతరం మండల ప్రజా పరిషత్ సభ్యుల పదవి కాలం పూర్తవుతున్న సందర్భంగా వారికి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటిసి నాగం కుమార్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్ రావు, పాక్స్ చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, కిషన్ రావు, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్, ఎంపీటీసీ లు, ఎంపిఓ ప్రదీప్, అధికారులు పాల్గొన్నారు.