రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలో గీత విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (1998-1999 SSC బ్యాచ్) ఆదివారం మహదేవ్ ఫంక్షన్ హాల్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. పాఠశాలలో ఆనాటి జరిగిన స్మృతులను నెమరు వేసుకుంటూ… ఒకరితో ఒకరు ఆప్యాయంగా పలకరించుకొని అందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పండగ వాతావరణం నెలకొంది. ముందుగా గీత విద్యా సంస్థల కరస్పాండెంట్ ఆయాచితుల రాంప్రసాద్ చిత్రమటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు: రమేష్,భాను ప్రకాష్,
విద్యార్దులు: సీఐ (ఆర్)సంపత్ కుమార్,
వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి,
వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్,
లయన్స్ క్లబ్ వేములవాడ పట్టణ అధ్యక్షుడు కట్కం శ్రీనివాస్,
కీర్తి కిషోర్ కుమార్,
రైకన్నపేట క్రాంతి కుమార్,
మల్యాల ఉపేందర్,
పండుగ తిరుపతి,
పిట్టల మధు,
రాజేంద్రప్రసాద్,
నరేందర్ రెడ్డి,
తిరుపతి రెడ్డి,
కనుకయ్య,
బండారి అనిల్ కుమార్,
దైత సతీష్ కుమార్,
సుమ,
సంధ్య,
వరలక్ష్మి,
సునీత,
పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. wow19tv.com