మంచి మనసు చాటుకున్న ఆంధ్రప్రభ విలేఖరి
చందుర్తి పిట్టల మంజుల కుటుంబానికి 6 వేల ఆర్థిక సాయం
జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా చేతుల మీదుగా అందజేత
చందుర్తి మండల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి రెండు కాళ్లు విరిగి మంచానికే పరిమితమై, ఆర్థిక ఇబ్బందులు,మెరుగైన వైద్యానికి ఆర్థిక స్తోమత లేదన్న విషయాన్ని
సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వేములవాడ టౌన్ ఆంధ్రప్రభ జర్నలిస్ట్, వైష్ణవి డిగ్రీ కాలేజ్ వేములవాడ కరస్పాండెంట్ అయాచితుల జితేందర్ రావు తన మంచి మనసును చాటుకున్నారు.
ప్రమాదంలో గాయపడ్డ మంజూలను పరామర్శించి 6 వేల రూపాయలను జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా చేతుల మీదుగా అందజేశారు…
తన తండ్రి గారైన కీర్తిశేషులు ఆయాచితుల రాంప్రసాద్ పుట్టిన గడ్డపై మమకారంతో రాబోవు రోజుల్లో చందుర్తి గ్రామంలో సేవా కార్యక్రమాల తో పాటు నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు..
ఈ కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీ,
సీనియర్ జర్నలిస్టు గొట్టే మనోహర్ ,
అజ్జు,
ఎల్లారెడ్డి బొట్లవారి శ్రీనివాస్,
మేడిశెట్టి మధు ,
యాకుబ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు.. wow19tv.com