ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల

wow19tv
By wow19tv

కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా అంధుల ఆశ్రమ పాఠశాల

అంధులకు (కళ్ళు లేని వారికి) కూడా విద్యనందిచాలనే ఉద్దేశ్యంతో

ప్రభుత్వం కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా అంధుల ఆశ్రమ పాఠశాలను స్థాపించింది.

ఈ పాఠశాలలో (1) నుండి (5)వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లో

మరియు (1) నుండి (10)వ తరగతి వరకు తెలుగు మీడియం లో బోధించబడును.

ఉచితంగా భోజన వసతి అందించబడును.

విద్యతో పాటు ప్రత్యేక software తో రూపొందించిన కంప్యూటర్ శిక్షణ & వివిధ కళల్లో శిక్షణ అందించబడును.

ఈ పాఠశాలలో చేరుటకు 6 నుండి14 సం.ల మధ్య వయస్సు కలిగి ఉండి,

జిల్లా మెడికల్ బోర్డుచే జారీ చేయబడిన సదరం సర్టిఫికెట్ 40% నుండి 100% అంధత్వం కలిగిన బాలబాలికలు అర్హులు.

కావున కరీంనగర్ & ఇతర జిల్లాలకు చెందిన అంధ బాలబాలికలను వారి తల్లిదండ్రులు,

ఆ గ్రామాల్లోని ఉపాద్యాయులు,

సర్పంచ్ లు,

గ్రామ కార్యదర్శులు,

అంగన్వాడీ టీచర్లు & స్వచ్ఛంద సంస్థలు

కరీంనగర్ లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో చేర్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేయుచున్నాము.

ఇట్లు,
ప్రిన్సిపాల్ & సిబ్బంది,
ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల, శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా, మల్కాపూర్ రోడ్. కరీంనగర్.
Ph. No:- 9494317315,

9701190124,

7396206959,

9440338424

Share This Article
Leave a comment