రాజన్న సిరిసిల్ల జిల్లా:
స్పోర్ట్స్ అకాడమీలలో ప్రవేశాలకు ఆహ్వానం.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2024-25 విద్యా సంవత్సరమునకు గాను, రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్ హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడమీ ఖమ్మం, హాకీ అకాడమీ వనపర్తి, సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ, సైక్లింగ్ వేలోడ్రోం ,ఉస్మానియా యునివర్సిటీ క్యాంపస్, వాలీబాల్ అకాడమీ సరూర్ నగర్ ఇన్డోర్ స్టేడియం మరియు వాలీబాల్ అకాడమీ, రాజన్న సిరిసిల్ల మొదలగు వివిధ స్పోర్ట్స్ అకాడమీలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకుగాను తేది.24, 25 వ జూన్ 2024 కు బదులుగా తేది. 03, మరియు 04 వ జులై 2024 రోజున ఉదయం.9.00 గంటల నుండి ఈ క్రింద తెలిపిన అకాడమీలలో క్రీడల ఎంపికలు నిర్వహించబడును.
Sl.NO Name of the Sports Institutions Disciplines Age criteria Venue
1 Cycling & Wrestiling Academy,Cycling Velodrome, O.U.Campus 1.Cycling
2.Wrestling 12 to 16 years Cycling Velodrome, O.U.Campus
2 Regional Sports Hostel,Hanumakonda 1.Athletics
2.Handball
3.Wrestling 12 to 16 years DSA,Hanumakonda
4.Gymnastics10 to 12 years
5.Swimming
3Athletics Academy,Khammam1.Athletics12 to 16 years
4 Hockey Academy, Wanaparthy 1. Hockey 12 to 16 years DSA,Wanaparthy
5 Volleyball Academy,Saroornagar 1.Gymnastic 10 to 12 years DSA, Saroornagar,Volleyball Academy,
2.Volleyball
14 to 16 years
6 Volleyball Academy, Rajanna Sircilla 1.Volleyball
కావున ఇట్టి ఎంపికలలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు మరియు క్రీడల నందు ఆసక్తి గలవారు, తెలంగాణ రాష్ట్ర స్థానిక బాలురూ మరియు బాలికలు పైన తెలిపిన క్రీడలలో ప్రవేశాలకై వారు పొందుకొన్నటువంటి NSF Sub – Junior National, SGFI Nationals and Participation and Merit in official state level championship organized by State association or SGF State level పార్టిసిపేషన్ మరియు మెరిట్ సర్టిఫికేట్ ల ఆధారంగా , రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల యొక్క శారీరక మరియు క్రీడ నైపుణ్యాన్ని పరీక్షించి ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి, ఎ.రాందాస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు కావలసిన ధ్రువ పత్రాలు: జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు 10 పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ( ఒరిజినల్ & జిరాక్స్ ) తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
జిల్లా యువజన మరియు క్రీడల అధికారి
(ఎ.రాందాస్)
పొ.నెం. 9440239783
రాజన్న సిరిసిల్ల జిల్లా