చేనేత కార్మికుల కోసం
విజన్ డాక్యుమెంటరీ
– వృత్తితో పాటు వ్యాపారంలోనూ పద్మశాలీలకు అవకాశం
– సిరిసిల్ల సొసైటీతో హైదరాబాదులో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి
– వస్త్రవిహార్ లాంటి పేరుతో నామకరణం చేసే యోచన
– వారణాసి టెక్ టైల్స్ మాదిరిగా సిరిసిల్లలో టెక్ టైల్స్ ఎక్స్టెన్షన్ సెంటర్
– విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల
చేనేత కార్మికుల సంక్షేమం కోసం, వారిని ఆర్థికంగా బలపరిచే యోజనతో ఒక విజినరీ డాక్యుమెంట్ ను రూపొందించనున్నట్లు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్ రావు మాట్లాడారు. మే డే సందర్భంగా చేనేత సోదరులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రస్థానం యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభమైందని, కార్మిక సంఘాలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ తీసుకొచ్చిన కేటీఆర్, సిరిసిల్ల కరీంనగర్ ను ఎందుకు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎంపీగా గెలిచిన అనంతరం కరీంనగర్ వరకు రైల్వే లైను పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. టెన్త్ ఫెయిల్ అయిన బండి సంజయ్ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రబుద్ధుడు అని ఏద్దేవా చేశారు. టీచర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయరు అనే కనీస జ్ఞానం లేని దద్దమ్మ అని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో వచ్చిన 25 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులలో కేవలం ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన వద్దామను ఓడించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని సూచించారు. కేటీఆర్ వినోద్ కుమార్ లు వలస పక్షులని, వేరే ప్రాంతవాసులకు ఇక్కడ ఏంటని ప్రశ్నించారు. ఇక హిందూయిజం, శ్రీరాముని ముందు పెట్టి ప్రజల మనోభావాలతో బిజెపి చెలగాటమాడుతుందని అంతర్యాలు సృష్టించి ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం శ్రామిక్ న్యాయ్ పథకం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఉపాధి హామీ కూలీలకు 400 భృతి తదితర సదుపాయలను కనిపిస్తుందని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి బట్టల వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉన్న పద్మశాలిల కోసం హైదరాబాద్ శిల్పారామం మాదిరిగా రెండెకరాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. వస్త్రవిహార్ లాంటి ఐదు పేర్లు తన దృష్టిలో ఉన్నాయని, వాటిలో ఏదో ఒక పేరుతో సిరిసిల్ల సొసైటీ చేనేత కార్మికులకు ఉచితంగా బిల్డింగ్ ఏర్పాటు చేసి అందులో షాపింగ్ కాంప్లెక్స్ ను తెరిచి వారికి అందుబాటులోకి తెచ్చే యోచన చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఉద్దేశం ద్వారా చేనేత కార్మికులు ఆర్థికంగా బలపడి, చాలామందికి ఉపాధి కూడా కల్పించే అవకాశం దక్కుతుందన్నారు. అలాగే వారణాసి టెక్స్ టైల్స్ మాదిరిగా సిరిసిల్లలో ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. wow19tv.com