మాజీ నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న గొట్టే పద్మ, మనోహర్ లు అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.
విరిపై రాజన్న సిరిసిల్ల,కామారెడ్డి ,జగిత్యాల,నిజామాబాద్, జిల్లాలో లో పలు కేసులు.
జిల్లాలో మహిళ కిడ్నప్ కేసులో వీరితో పాటుగా మరో ఆరుగురు పై కేసు నమోదు రిమాండ్ కి తరలింపు,పరారిలో ఇద్దరు.
మంగళవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన జక్కు ధరణి మున్నూరు కాపు ,బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కమటం కృష్ణవంశీ sc మాదిగ ఇద్దరు ప్రేమించుకొని 2022 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నరు.ఈ పెళ్లి ధరణి వల్ల కుటుంబ సభ్యులకు ఇష్టం లేనందున ఎలాగైనా తమ కూతురి మనసు మార్చి తమ కులం వారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోని కొనరావుపేట్ ప్రస్తుతం కామారెడ్డి జిల్లాకి చెందిన గొట్టే పద్మ w/o మనోహర్, గొట్టే మనోహర్ (మాజీ నక్షలైట్లు) లను ధరణి అమ్మ లక్ష్మీ ,అన్న రాజశేఖర్ లు కలువగా పద్మ మరియు మనోహర్ లు వీరి వద్ద 5,00,000/- రూపాయలు ఇస్తే మేము పరిష్కారిస్తాం అని ఒప్పదం చేసుకొని, దరణిని కిడ్నప్ చేయడానికి ఒక సంవత్సరం నుండి ప్రణాళిక వేసుకొని ధరణి అమ్మ,అన్న మరియు మర్రి గడ్డ గ్రామానికి చెందిన కత్తి రాము, వేములవాడ గ్రామానికి చెందిన ఎక్కలదేవి బాలకిషన్, టిల్లు జగదీష్ ల సహాయంతో ఒక పథకం వేసి ఒక ఎర్టిగా కారు కిరాయి తీసుకొని, తేదీ 22.8.2024 రోజున మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అత్తగారి ఇంట్లో ధరణి ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయగా ధరణి ఆడపడుచు ఆపడానికి ప్రయత్నం చేయగా వారి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి దరణిని బలవంతంగా కామారెడ్డి అక్కడి నుండి నిజామాబాద్ జిల్లాలోని చుండూరు గ్రామం,అక్కడి నుండి నాందేడ్ వైపు తీసుకువెళ్లి ధరణి మనసు మార్చాలని ప్రయత్నం చేశారు.
బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ధరణి కుటుంబ సభ్యులు పిర్యాదు చేయగా బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుసుకొని ధరణి ని తిరిగి బూరుగుపల్లి గ్రామ శివారులో విడిచిపెట్టగా అమ్మాయి ధరణి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ వారికి తెలియజేయగ జక్కు లక్ష్మీ ,జక్కు రాజశేఖర్ , కత్తి రమేష్ @ రాము,గొట్టే మనోహర్ ,గొట్టే పద్మ , ఎక్కలదేవి బాలకృష్ణ ,గొట్టే పద్మ ,టిల్లు,జగదీష్ @జగ్గూ లపై కేసు నమోదు చేసి ఆదివారం రోజున జక్కు లక్ష్మీ ,జక్కు రాజశేఖర్ , కత్తి రమేష్ @ రాము,గొట్టే మనోహర్, ఎక్కలదేవి బాలకృష్ణ వేములవాడ బల్ నగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది. గొట్టే పద్మ ని ఈ రోజు వేములవాడ లో అదులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.
అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని పరారిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్నారు.
కొనరావుపేట్ మండలనికి చెందిన ప్రస్తుతం కామారెడ్డి లో ఉంటున్న గొట్టే మనోహర్ మాజీ మాజీ నక్సలైట్ మరియు భార్య గొట్టే పద్మ వీరు ఇద్దరు కలసి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం అని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారాని వీరి పై రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ,జగిత్యాల జిల్లాలో పలు కేసులు నమోదు కావడం జరిగిదని తెలిపారు.గొట్టే పద్మ, మనోహర్ లకి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే సబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని, అంతే కాక మాజీ నక్సలైట్ల పేరుతో బెదరింపులకు పాల్పడితే వవారి సమాచారం అందించాలని వారి పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
నిందుతుల వివరాలు.
1.జక్కు లక్ష్మీ w/o రాజారాం age 45,గ్రామం మానాల, రుద్రంగి.
2.జక్కు రాజశేఖర్ s/o రాజారాం, age 24,గ్రామం మానాల, రుద్రంగి.
3.కత్తి రమేష్ @ రాము, s/o నారాయణ, age 33,మర్రిగడ్డ గ్రామం,చందుర్తి.
4.గొట్టే మనోహర్ s/o నర్సయ్య, కొనరావుపేట్,(ప్రస్తుతం కామారెడ్డి.)
1.గొట్టే పద్మ w/o మనోహర్, కొనరావుపేట్.(ప్రస్తుతం కామారెడ్డి.)
5.ఎక్కలదేవి బాలకృష్ణ s/o దేవయ్య ,age 30,మలక్ పెట్,కొనరావుపేట్ మండల్. ప్రస్తుతం వేములవాడ.
పరారిలో ఉన్నవారి వివరాలు.
1.టిల్లు.
2.జగదీష్ @జగ్గూ.
ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,సి.ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.