కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. wow19tv.com
గ్రామం నుండి మొదలుకొని పట్టణాల వరకు టిఆర్ఎస్ పార్టీకి ఉన్న శక్తి, క్యాడర్ జాతీయ పార్టీలైన బిజెపి కాంగ్రెస్లకు లేదని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. కేవలం 1.8% ఓట్లతో మాత్రమే అధికారం కోల్పోయామని కానీ మనం కోల్పోయింది అధికారం కాదని ప్రజాసేవ చేసే అవకాశాన్ని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ఓట్ల కోసం గోదావరి జలాలను తమిళనాడు తరలించే కుట్ర జరుగుతోందని దీనిని అడ్డుకునేందుకు గులాబీ పార్టీకి మాత్రమే శక్తి ఉందన్నారు. ఆ రోజుల్లో ఐదుగురు ఎంపీలుగా గెలిస్తే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అవహేళన మాట్లాడాలని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధనలో ఐదుగురు ఎంపీలుగా ఉన్న తాము 32 రాజకీయ పార్టీల దగ్గరకు వెళ్లి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు.
-ఐదుగురు ఎన్నికల గెలిచి 32 రాజకీయ పార్టీ దగ్గరికి తెలంగాణ సాధించుకున్నాం ఎంతమంది ఉన్నాం అనేది కాకుండా సమస్యల మీద ఎంత అవగాహన ఉందనేది ఇక్కడ ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. wow19tv.com
ఎన్నికల్లో కష్టపడితే విజయం మనదే
రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య
బూత్ కమిటీల వారిగా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం మనదే అవుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగై అన్నారు. ఎన్నికల్లో ప్రతి ఇంటికి తిరగడంతో పాటు బంధు,మిత్రులు శ్రేయోభిలాషులకు వెళ్లి మన పార్టీ గురించి చెప్పి ఓట్లు అడగాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలోనియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, ఎన్నికల నియోజకవర్గం ఇన్చార్జి ప్రవీణ్, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తులా ఉమా, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ , మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, ఎంపీపీ వజ్రమ్మ, గంగం సరూప రాణి, రేణుక, చంద్రయ్య గౌడ్, జెడ్పిటిసిలు మ్యాకల రవి, నాగం భూమయ్య , సెస్ డైరెక్టర్లు హరిచరణ్ రావు, ఆకుల దేవరాజం, ఆకుల గంగారం, పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, మల్యాల దేవయ్య మేకల ఎల్లయ్య, సత్తిరెడ్డి, క్రాంతి కుమార్. wow19tv.com