ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

wow19tv
By wow19tv
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

🔵విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేసిన ఎంపీపీ గారు

🟢ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను కల్పిస్తాం.

🟣ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ఇల్లంతకుంట ఎంపీపీ శ్రీ వుట్కూరి వెంకట రమణారెడ్డి గారు అన్నారు.

మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు, విద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.

మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో, పాటుగా నోట్ బుక్ లను కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు విశాలమైన మైదానం, విశాలమైన తరగతి గదులు, చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను, ఎంతో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే అందించ బడుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారి వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపివ్వకుండా, ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఒగ్గు నరసయ్యయాదవ్ , మాజీ సర్పంచ్ బాలరాజు, హెచ్ ఎం శారద, ఉపాధ్యాయులు, కార్యదర్శి సుంకే వరుణ్, పద్మ, ఓగ్గు విజయ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

Share This Article
Leave a comment