రాజన్న సిరిసిల్ల జిల్లా.
ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ నుండి దేవస్థానం ఎదురుగా అమరవీరుల స్థూపం వరకు జిల్లా, కేంద్ర బలగలతో కొనసాగిన ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ
ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ రోజు తేదీ 11-05-2024 సాయంత్రం 06 గంటల నుండి సోమవారం 13-05-2024 సాయంత్రం 06 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది కావున పోలింగ్ స్టేషన్ ల సమీపంలో ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదని,పోలింగ్ రోజు ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా తిరగవద్దని,శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని,శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్పీ గారి వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రాచరి, సి.ఐ లు వీరప్రతాప్, శ్రీనివాస్ ,ఎస్.ఐ లు మారుతీ, అంజయ్య, ఏళ్లగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.