రాజన్న సిరిసిల్ల జిల్లా:
వేములవాడ:
ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలి: బిజెపి నాయకులు
రైతులు వరి కోతలు మొదలుపెట్టి నెలరోజులపై అతుంది ఇప్పటి వరకు వడ్లు కళ్ళాలల్లో అకాల వర్షాలతో తడిసి మొలకెత్తుతున్న ఈ రాష్త్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల విషయంలో మొద్దు నిద్ర వహిస్తుంది
రైతుల పక్షాన నిరంతరం పోరాడే బిజెపి పార్టీ శ్రేణులు బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వడ్ల కళ్ళాలను సందర్శించి మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలని , కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని వడ్ల కొనుగోలు జరిపే వరకు ప్రతీ రోజు బిజెపి నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలపడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, రూరల్ ఎంపీపీ బండ మల్లేశం, సంటీ మహేష్, కోల కృష్ణ స్వామి, గోపు బాలరాజు,మైలారం శ్రీనివాస్, గుడిసె మనోజ్,మెరుగు లక్ష్మణ్, పిన్నింటి హనుమండ్లు,వాసం మల్లేశం యాదవ్,లక్ష్మిరాజం, బోనాల శివ, కుమ్మరి మారుతి, బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది