కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ బిజెపిలది మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. wow19tv.com
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద కండువా తీసి నిలబెడితే ఎవరు గుర్తుపట్టక పోగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తుపట్టాలని ఎద్దేవా చేశారు. నిజానికి కరీంనగర్ జీవన్ రెడ్డి లేదా ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకుల పోటీ చేయాల్సి ఉండేదని వీరిద్దరైతే పోటీ ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్లు డమ్మీ కాండేట్ ను ఎంపిక చేశారని అన్నారు.
రేవంత్ రెడ్డి వి చిల్లర మాటలు ఉద్దెర పనులు
సీఎం రేవంత్ రెడ్డిది చిల్లర మాటలు ఉద్దెర పనులని కేటీఆర్ అన్నారు. లంకె బిందెలు దొరుకుతాయని వచ్చానని మాట్లాడడమే కాకుండా జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నానని మాటలు చిల్లర మాటల్లో ఉన్నాయన్నారు. ఇక సంక్షేమ పథకాల్లో అన్ని కూడా ఉద్యర ఖాతాలేనని విమర్శించారు.
ఆది సీనన్న తులం బంగారం ఇప్పించు..
నిరుపేద యువతి వివాహానికి బంగారం కూడా ఇస్తామని ఎన్నికల్లో మాయమాటల హామీలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. వేములవాడలో బంగారం దుకాణాలు లేవా ఆది శ్రీను అన్నకు చెప్పి ఇప్పించాలని ఆయన కార్యకర్తల సూచించారు.
70 ఏళ్ల వయసులోనూ కష్టపడుతున్నారు..
70 ఏళ్ల వయసులో 20 ఎముక విరిగిన పార్టీ అధినేత కేసిఆర్ బస్సు యాత్రతో ప్రజల వచ్చి ప్రచారం చేస్తూ కష్టపడుతున్నారని కేటీఆర్ అన్నారు. 12 టిఆర్ఎస్ సీట్లు గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుందని కార్యకర్తలకు ధైర్యాన్ని నింపారు. ప్రతిరోజు ఉదయం ఒక గంట సాయంత్రం రెండు గంటలు మీ బూత్ కమిటీలో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాల వైఫల్యాలు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అడగాలని ఆయన కార్యకర్తలకు చెప్పారు. గ్రామాల్లోని మన పంచాయతీలు పక్కన పెట్టి తల్లి లాంటి పార్టీ కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలిచి కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు.